Harish Shankar Shocking :ఆస‌క్తిక‌రంగా మారిన హ‌రీశ్ లీక్స్

రీమేక్స్ ను తెర‌కెక్కించ‌డంలో సక్సెస్

Harish Shankar : ఏమిటీ హ‌రీశ్ లీక్స్ అనుకుంటున్నారా. త‌ను హాట్ టాపిక్ గా మారాడు. నిత్యం సాహిత్యంతో కుస్తీ ప‌డే ద‌ర్శ‌కుల‌లో త‌ను కూడా ఒక‌డు. మాట‌ల‌ను తూటాల కంటే శ‌క్తివంతంగా ప్ర‌యోగించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. త‌ను మాస్ మ‌హారాజాతో తీసిన మూవీ ఢ‌మాల్ మంది. బాక్సుల వ‌ద్ద బోల్తా ప‌డింది. అయినా మ‌నోడు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం త‌ను తీయబోయే రీమేక్ మూవీ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Harish Shankar Comments

త‌ను సినిమాకు సంబంధించి తీసిన ఓ స‌న్నివేశపు ఫోటోను పంచుకున్నాడు. ఇది వైర‌ల్ గా మారింది. డ్రాగ‌న్ ఈవెంట్ లో ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర కోరిక‌ను వ్య‌క్తం చేశాడు. తాను ఒక‌వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో గ‌నుక సినిమా తీస్తే అందులో కారుపై త‌ను కూర్చున్న సీన్ త‌ప్ప‌కుండా తీస్తానంటూ ప్ర‌క‌టించాడు అశ్వ‌త్ మారిముత్తు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్నాడు. త‌ను హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో బిజీగా ఉన్నాడు. సాధ్య‌మైనంత వ‌ర‌కు పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు ద‌ర్శ‌కుడు. ఇది పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఇందులో నిధి అగ‌ర్వాల్ కీల‌క పాత్ర పోషిస్తోంది.

ఈ స‌మ‌యంలో మారిముత్తు చేసిన కామెంట్స్ కు స్పందించాడు హ‌రీశ్ శంక‌ర్(Harish Shankar). తాను ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కారుపై ఎక్కి కూర్చున్న సీన్ ను తీశానంటూ స్ప‌ష్టం చేశాడు. ఈ మేర‌కు స‌ద‌రు ఫోటోను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్స్ దీనికి హ‌రీశ్ లీక్స్ అని పేరు కూడా పెట్టేశారు.

Also Read : Beauty Aishwarya-Suzhal :అమెజాన్ ప్రైమ్ లో ఐశ్వ‌ర్య సుజ‌ల్ 

CommentsHarish SankarUpdatesViral
Comments (0)
Add Comment