Hardik- Beauty Janhvi : హార్దిక్ పాండ్యా జాహ్న‌వి క‌పూర్ డేటింగ్..?

సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్

Janhvi  : ఆ ఇద్ద‌రూ మోస్ట్ పాపుల‌ర్. ఉన్న‌ట్టుండి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు. వారు ఎవ‌రో కాదు ఒక‌రు క్రికెట్ రంగానికి చెందిన ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కాగా మ‌రొక‌రు బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టి జాహ్న‌వి క‌పూర్(Janhvi). ఈ ఇద్ద‌రూ పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Hardik- Janhvi Kapoor…

త్వ‌ర‌లోనే భార‌త జ‌ట్టు చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది. ఈ త‌రుణంలో పాండ్యా డేటింగ్ లో ఉండ‌డం త‌న కెరీర్ ప‌రంగా ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రో వైపు క్రికెట్, సినీ రంగానికి చెందిన క్రికెట‌ర్లు, న‌టీమ‌ణులు క‌లిసి తిర‌గ‌డం, పార్టీల‌కు వెళ్ల‌డం ప‌రిపాటి.

ఆనాటి మ‌న్సూర్ అలీ ఖాన్ పటౌడి , ష‌ర్మిలా ఠాగూర్ నుంచి నేటి క్రికెట‌ర్ల దాకా. కాగా ఇటీవ‌లే టెక్నాల‌జీలో కీల‌క‌మైన మార్పు వ‌చ్చింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ రావ‌డంతో త‌మ‌కు ఇష్ట‌మైన వారిని ఇలా ఫోటోస్ క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారు.

ఇంత‌కూ హార్దిక్ పాండ్యా, జాహ్న‌వి క‌పూర్ డేటింగ్ లో ఉన్నారా అనే దానిపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇటీవ‌ల మ‌రో క్రికెట‌ర్ ష‌మీ, టెన్నిస్ తార సానియా మీర్జాతో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిర‌గ‌డం కూడా ఏఐ క్రియేట్ చేసిన‌వేన‌ని తేలి పోయింది. తాజాగా పాండ్యా, జాహ్నవి జంట కూడా ఏఐ ద్వారా త‌యారు చేశార‌ని తేలి పోయింది ఫ్యాక్ట్ చెక్ లో.

Also Read : Beauty Anshu Ambani : డైరెక్ట‌ర్ త్రినాథ‌రావుపై మ‌హిళా క‌మిష‌న్ ఫైర్

Hardik PandyaJanhvi KapoorUpdatesViral
Comments (0)
Add Comment