Hari Hara Veera Mallu : క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన హరి హర వీర మల్లు(Hari Hara Veera Mallu) చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ , టీజర్ ఉత్కంఠను రేపుతోంది. ఈ మూవీకి స్క్రీన్ ప్లే క్రిష్ నిర్వహిస్తుండగా బుర్రా సాయి మాధవ్ డైలాగులు రాశారు. ఏఎం రత్నం దీనిని నిర్మిస్తున్నాడు.
Hari Hara Veera Mallu Updates
పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ , బాబీ డియోల్ , నోరా ఫతేహి నటించారు. విక్రమ జీత్ విర్క్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎంఎం కీరవాణి హరి హర వీరమల్లుకు సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్ , రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా పంపిణీ చేయనున్నారు.
సినిమా బడ్జెట్ తొలుత రూ. 150 కోట్లు అనుకున్నారు. కానీ రోజు రోజుకు బడ్జెట్ మరింత పెరిగింది. దాదాపు రూ. 200 కోట్లు దాటింది. వీరమల్లు జీవితాన్ని తెర కెక్కించే ప్రయత్నం చేశాడు క్రిష్. ఇది 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించింది కావడం విశేషం.
చిత్రం షూటింగ్ 2020లో ప్రారంభమైంది. కానీ కరోనా , వివిధ రాజకీయ కారణాల రీత్యా సినిమా చిత్రీకరణ , విడుదల చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.
Also Read : Shiva Nirvana : ఖుషి మూవీపై దుష్ప్రచారం తగదు