Bobby Deol : బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ పుట్టిన రోజు జనవరి 27న. ఈ సందర్బంగా తను నటిస్తున్న హరి హర వీరమల్లు మూవీ మేకర్స్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా న్యూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు నటుడు. తన కెరీర్ లో సెకండ్ ఇన్సింగ్స్ ను స్టార్ట్ అయ్యేలా చేశాడు పాన్ ఇండియా డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి. తను తీసిన యానిమల్ మూవీలో బాబీ డియోల్(Bobby Deol) ను ఏరికోరి తీసుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలలో నటించాడు.
Bobby Deol Got Birthday Gift
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ రోల్ లో నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. సృజనాత్మక దర్శకుడిగా పేరు పొందిన క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ ప్రస్తుతం ఏపీలో బిజీగా ఉన్నారు . ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరాడు.
ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తోంది అందాల కన్నడ సినీ రంగానికి చెందిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఇక ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో బాబీ డియోల్ నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కు భారీ ఆదరణ నెలకొంది.
పవన్ కళ్యాణ్ పాట కూడా పాడారు. ఇది కూడా వైరల్ అయ్యింది. బాబీ డియల్ ఇవాల్టితో తనకు 56 ఏళ్లు నిండాయి. పీరియాడిక్ డ్రామా కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తనను చక్రవర్తిగా చూపించారు.
ఈ సందర్బంగా అద్భ/తమైన నటుడు బాబీ డియోల్ కు పుట్టిన రోజు బహుమతి అంటూ పేర్కొన్నారు మూవీ మేకర్స్.
Also Read : Pushpa 3 – Hero Bunny : మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 3’ అనౌన్స్