Hari Hara Veera Mallu : పవర్ స్టార్ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్

అయితే ఆగస్ట్‌లోనే పవన్‌ ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టాల్సి ఉంది...

Hari Hara Veera Mallu : పవన్‌కల్యాణ్‌ తదుపరి చిత్రాన్ని తెరపై చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఈ న్యూస్‌ మంచి శుభ‌వార్త‌. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ , ఓజీ’, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాలు చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నిక‌లు, డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇలా రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో బిజీ అవ‌డంతో త‌ను న‌టించాల్సిన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈ చిత్రాలకు పవన్‌కల్యాణ్‌ 20 రోజుల చొప్పున షూటింగ్‌ చేస్తే చిత్రీకరణ పూర్తయిపోతుందని ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్‌ ప్రకటించారు. దీంతో తాజా సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ చిత్రానికి డేట్స్‌ ఇచ్చారని, సెప్టెంబర్ 23 నుంచి ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు స్ప‌ష్టం చేశారు.

Hari Hara Veera Mallu Movie Updates

అయితే ఆగస్ట్‌లోనే పవన్‌ ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. రాజకీయ పనుల్లో బిజీ కావడం, మరో పక్క వరదల కారణంతో ఆయన షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపారు. ఇదిలాఉండ‌గా హరిహర వీరమల్లు కోసం పవన్‌ కల్యాణ్‌ 20 రోజులు షూటింగ్ చేస్తే చాలు సినిమా మొత్తం పూర్తయినట్లే. తదుపరి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించి సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది. పవన్‌ చేయాల్సింది అంతా ఇండోర్‌ షూట్‌ మాత్రమే. అందు కోసం సెట్‌ వర్క్ కూడా విజయవాడలో జరుగుతోంది. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు.

ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో 400 మంది సిబ్బంది, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ‘ బ్రేవ్ హార్ట్’, ‘గ్లాడియేటర్’, ‘బోర్న్ ఐడెంటిటీ’, ‘ది లాస్ట్ సమురాయ్’, ‘రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్’ వంటి పలు క్లాసిక్ చిత్రాలకు పని చేసిన చ‌రిత్ర నిక్ పావెల్‌కు ఉంది. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు.

Also Read : Devara Updates : భారీ క్రేజ్ ఉన్న ‘దేవర’ మలయాళ మార్కెట్ రైట్స్ 50 లక్షల

CinemaHari Hara Veera Mallupawan kalyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment