Hanuman: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘హనుమాన్‌’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘హనుమాన్‌’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Hanuman: చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో దిగి… పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘హనుమాన్‌’. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్(Hanuman)’. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా… వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీనితో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 సంస్థ ఈ సినిమా విడుదలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఓటీటీ రిలీజ్ లో జాప్యం కారణంగా ఒకానొక దశలో నెటిజన్లు… స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం, చిత్ర యూనిట్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది.

Hanuman OTT Updates

అయితే ‘హనుమాన్‌’ సినిమాను ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ చేసింది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5. సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు 66 రోజుల తరువాత ఓటీటీలో విడుదల చేసారు. ఆదివారం ఉదయం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనితో పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ సైతం శనివారం రాత్రి నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీలో చిత్రాన్ని వీక్షించిన పలువురు నెటిజన్లు క్లైమాక్స్‌ సీన్‌ విజువల్స్‌ షేర్‌ చేసి… ‘అద్భుతం. ఎట్టకేలకు సినిమా చూశాం’, ‘తేజ సజ్జా యాక్టింగ్‌ బాగుంది. ఈ ఒక్క సీన్‌ చాలు ఈ ఏడాది అవార్డులన్నీ అతడికే వస్తాయని చెప్పడానికి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

Also Read : The Crew: ఆకట్టుకుంటోన్న ‘ది క్రూ’ ట్రైలర్ !

hanumanPrasanth VarmaTeja SajjaZ5
Comments (0)
Add Comment