Hanuman Review : ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా నిలిచిన సినిమాల్లో ‘హనుమాన్’ ఒకటి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ కథానాయకుడు తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపిన చిత్ర బృందం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా “హనుమాన్`ని విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ని సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని లొకేషన్లలో ప్రీమియర్ షోలు వేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న ప్రీమియర్ షోకి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా గురించే తరచుగా మాట్లాడుకుంటున్నారు.
Hanuman Review Viral
ఇప్పటికే హనుమాన్ సినిమాకు సంబంధించిన వెబ్‌సైట్లు కిక్కిరిసిపోయాయి. ఈ చిత్రానికి ఇండియా అంతటా విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. హనుమాన్ సినిమా చూశానని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్(Taran Adarsh) తెలిపారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని… తనకు గూస్‌బంప్స్‌వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
అందరూ ఈ చిత్రాన్ని చూడాలని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. డ్రామా, ఎమోషన్, విజువల్ ఎఫెక్ట్స్, పౌరాణికాలకు సంబంధించిన అన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
ఈ సినిమాలో తేజ సజ్జ నటన అద్భుతంగా ఉందని. అలాగే వరలక్ష్మి తన నటనతో ప్రేక్షకులకు మరపురాని ముద్ర వేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే సముద్రకని, వినయ్ రాయ్ అద్భుతంగా చేసారని తరణ్ ఆదర్శ్ తెలిపారు. సినిమా యొక్క అతిపెద్ద బలం వీఎఫ్ఎక్స్ అని, కానీ అవి కొంచెం తక్కువగా ఉంటె ఇంకా బాగుండేదని చెప్పుకొచ్చారు. హిందీ వెర్షన్ చూసిన తర్వాత తొలిసారి ఈ విషయం చెప్పానని ట్వీట్ చేశాడు.దింతో హనుమాన్ సినిమాపై కొంత పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది.
Also Read : Guntur Kaaram Updates : ఎట్టకేలకు అనుమతి సాధించిన ‘గుంటూరు కారం’