Hanuman Director: ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు రూ. 1000 కోట్ల ఆఫర్‌ ?

'హనుమాన్‌' దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు రూ. 1000 కోట్ల ఆఫర్‌ ?

Hanuman Director: అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. స్టార్ హీరో సినిమా అట్టర్ ప్లాప్ అయినా… చిన్న సినిమా బ్లాక్ బస్టర్ అయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జీరోను హీరో చేయాలన్నా… హీరోను జీరో చేయాలన్నా ఒకే ఒక్క శుక్రవారం చాలు. ఒక్క సినిమా హిట్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు… ముఖ్యంగా చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చి… ఊహించని రీతిలో విజయాలు సాధించి… ఇండస్ట్రీ హిట్ తో మేకర్స్ తలరాతను మార్చేస్తాయి.

Hanuman Director Got Huge Offer

అలాంటి అద్భుతం చాలా సంవత్సరాల తరువాత సంక్రాంతి బరిలో నిలబడిన అతి చిన్న సినిమా ‘హను-మాన్‌’ సాధించి మేకర్స్ తలరాతనే మర్చేసింది. కేవలం పదికోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 275 కోట్లు వసూలు చేసి రూ. 300 కోట్లవైపు దూసుకుపోతుంది. దీనితో ‘హను-మాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు(Prasanth Varma) ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్ చిన్న దర్శకుల లిస్ట్ లో ఉన్న ప్రశాంత్… ‘హను-మాన్‌’ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడైపోయాడు. దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్‌ వద్ద క్యూ కడుతూ అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్వయంగా చెప్పారు.

‘హను-మాన్‌’ సినిమా చూసిన తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థలు తనను సంప్రదిస్తున్నాయని… వంద, రెండు వందల కోట్లు కాదు ఏకంగా వెయ్యి కోట్లు బడ్జెట్ కూడా పెట్టడానికి ఆ నిర్మాణ సంస్థలు సముఖత వ్యక్తం చేస్తున్నాయంటూ ఇటీవల ఓ ఇంటర్వూలో స్వయంగా ప్రశాంత్(Prasanth Varma) చెప్పారు. అంతేకాదు ఓ ఎన్ఆర్ఐ అయితే భారతీయ ఇతిహాలతో ‘హను-మాన్‌’ లాంటి సినిమా తీస్తానంటే రూ. 1000 కోట్లు బడ్జెట్‌ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పారట. అయితే ఇక్కడ బడ్జెట్‌ ముఖ్యం కాదు… పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. అందుకే అటువంటి ఆఫర్లకు ఎస్ చెప్పలేదు అని స్పష్టం చేసారు.

నేను ఒక 10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే… దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తాను. 40 కోట్లతో తీస్తే… దాన్ని రూ.150 కోట్ల సినిమాలా చూపిస్తాను. మార్కెట్‌ను అంచనా వేసుకొని సినిమాను తెరకెక్కిస్తాను’అని ప్రశాంత్‌ వర్మ అన్నారు. రూ.1000 కోట్ల ఆఫర్‌ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్‌ వర్మకు అంత పెద్ద ఆఫర్‌ రావడం గొప్ప విషయమే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Megastar Chiranjeevi: ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ జిమ్ వర్కౌట్స్ !

hanumanPrasanth Varma
Comments (0)
Add Comment