Hanuman: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ‌నుమాన్’

సెన్సార్ పూర్తి చేసుకున్న 'హ‌నుమాన్'

Hanuman: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తోన్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో… వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘హను-మాన్’ టీజర్… సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ సినిమాపై నేషనల్ లెవల్ క్రేజ్ ఏర్పడింది. దీనితో ఈ హను-మాన్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ ‘హనుమాన్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ సంపాదించింది.

Hanuman – ‘హ‌నుమాన్’ కు యూ/ఏ సర్టిఫికేట్

సంక్రాంతి కానుకగా వస్తున్న ‘హ‌నుమాన్(Hanuman)’ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ‘హ‌నుమాన్’ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. హనుమాన్ విజువల్ గా అద్భుతంగా వుంది. ఎమోషన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉన్నాయి. కంటెంట్ చాలా మెస్మరైజింగ్‌గా ఉందంటూ చిత్ర బృందాన్ని సెన్సార్ సభ్యులు అభినందినట్లు తెలుస్తోంది.

Also Read : Hero Kalyan Ram: ‘డెవిల్‌ పార్ట్‌ 2’ అనౌన్స్‌ చేసిన కళ్యాణ్ రామ్

hanuman
Comments (0)
Add Comment