Hanuman : మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ దూకుడు కొనసాగుతోంది. ప్రీమియర్ స్క్రీనింగ్ ద్వారా 3 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. మార్కెట్ షేర్ రూ.6 కోట్లకి పైగా టోటల్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతే కాదు… మూడు రోజుల్లోనే కొత్త రికార్డ్సకి కేరాఫ్‌గా నిలిచింది హనుమాన్. హనుమాన్(Hanuman) సినిమా 2024లో తొలిసారి తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా హిట్ అయింది.
Hanuman 1st Week Collections Update
సంక్రాంతి పోటీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారంతో పోటీ పడి విజయం సాధించింది. ఈ చిత్రం మొదటి రోజు నుండి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు తెలుగులో విడుదలైన ఏడో రోజున రూ.4.55 కోట్ల షేర్ను అందుకుంది. ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 7.82 కోట్ల షేర్లు(రూ 14.35 కోట్ల బాక్స్ ఆఫీస్ వసూళ్లు తో బలంగా ఉంది). అదనంగా, ఇది అమెరికాలో $4 మిలియన్లను డాలర్లు వసూలు చేసింది, RRR మరియు సలార్ రికార్డులకు చేరువైంది.
ఇదే జోరు కొనసాగితే యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ఇప్పటివరకు 22.92 కోట్ల నెట్ కలెక్ట్ చేయగలిగింది. మొత్తానికి ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 76.69 కోట్ల వాటా (మొత్తం రూ. 143.8 కోట్లు) రాబట్టినట్టు సమాచారం. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీరిలీజ్ థియేట్రికల్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.29. 65 కోట్లు వసూలు చేసింది. 30.50 కోట్ల బ్రేక్-ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. థియేట్రికల్ బాక్సాఫీస్ ఆదాయం $46.19 కోట్లు వసూలు చేసింది.
వారం రోజుల్లోనే టోటల్ గా రూ.50 కోట్లు లాభాలను ఆర్జించిన ఈ సినిమా బయ్యర్లకు ఎంత వరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కు మరో 40 కోట్లు నిర్మాతలకు అదనపు లాభం.
Also Read : Rashmika Mandanna : సందీప్ రెడ్డి రూటే డిఫరెంట్ అంటున్న రష్మిక