Hansika Motwani: దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో యంగెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి హాన్సిక. దేశముదురు సినిమా హిట్ అయినప్పటికీ… ఆ తరువాత హన్సికకు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. దీనితో ఆమె కోలీవుడ్ కు షిప్ట్ అయి వరుస తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత ఈ బ్యూటీ ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే తెలుగు సినిమా చేయగా… నవంబరు 17న అది థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హన్సిక(Hansika Motwani) ఫెర్ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చినప్పటికీ… సినిమా మాత్రం సరిగా ఆడలేదు. దీనితో ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సడన్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రత్యక్షమైయింది ఈ సినిమా.
హన్సిక ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ `మై నేమ్ ఈజ్ శృతి`. స్కిన్ మాఫియా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీశర్మ, పూజా రామచంద్రన్, ప్రేమ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు.
Hansika Motwani – ‘మై నేమ్ ఈజ్ శృతి’ కథేమిటంటే ?
శృతి (హన్సిక) యాడ్ ఏజెన్సీలో ఉద్యోగి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తాత, అమ్మ పెంపకంలో పెద్దదవుతుంది. చరణ్ ( సాయి తేజ)తో ప్రేమలో ఉన్న ఆమె జీవితం అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఎమ్మెల్యే గురుమూర్తి (నరేన్) ముఠా వలలో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో కీలకమైన గురుమూర్తి చేస్తున్న దారుణాలన్నీ శృతికి తెలుస్తాయి . ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి ? ఈ స్కిన్ మాఫియా ముఠా వెనక ఎవరున్నారు ? ఎవరెవరు ఇందులో భాగం అయ్యారు ? ఈ ముఠాపై శృతి పోరాటం ఎలా సాగింది అనే విషయాలను చాలా ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్.
Also Read : Chandrabose: తెలుగు డాక్యుమెంటరీకు కేన్స్ పురస్కారం !