Hansika Motwani Sensational :గృహ హింస కేసు నుంచి త‌ప్పించండి

బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన హ‌న్సిక

Hansika Motwani : బాలీవుడ్ న‌టి హ‌న్సిక మోత్వానీ(Hansika Motwani) సంచ‌ల‌నంగా మారారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇప్ప‌టికే త‌న‌పై గృహ హింస కేసు న‌మోదైంది. ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని, కోర్టు జోక్యం చేసుకోవాల‌ని విన్న‌వించారు. ఈ కేసు నుంచి త‌న‌ను ర‌క్షించాల‌ని కోరారు. అంత‌కు ముందు ఆమె క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా హ‌న్సిక మోత్వానీ, ఆమె త‌ల్లిపై సోద‌రుడి భార్య ఫిర్యాదు చేసింది. త‌న‌ను నానా రకాలుగా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఫిర్యాదు చేసింది.

Hansika Motwani Sensational Comments

దీంతో హ‌న్సిక‌తో పాటు ఆమె త‌ల్లిపై గృహ హింస‌కు పాల్ప‌డినందుకు గాను కేసు న‌మోదు చేశారు. ఈ కేసును విచారించింది జ‌స్టిస్ సారంగ్ కొత్వాల్ , జ‌స్టిస్ ఎస్ఎంల‌తో కూడిన ధ‌ర్మాస‌నం. హ‌న్సిక వ‌దిన‌కు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై 3కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హ‌న్సిక మోత్వానీ సోద‌రుడు ప్ర‌శాంత్ మోత్వానీ 2020లో టెలివిజ‌న్ న‌టి ముస్కాన్ జేమ్స్ నాన్సీని పెళ్లి చేసుకున్నాడు.

ఇదే స‌మ‌యంలో కొంత కాలం బాగానే ఉన్నారు. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత 2022లో విడి పోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే క్ర‌మంలో ముస్కాన్ ప్ర‌శాంత్, హ‌న్సిక మోత్వానీ, త‌ల్లి జ్యోతిపై గృహ హింస కింద ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో ముంబై సెష‌న్స్ కోర్టు హ‌న్సిక, త‌ల్లికి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కొట్టి వేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Also Read : Hero Mahesh Babu-SSMB29 :రెండు భాగాలుగా ప్రిన్స్..జ‌క్క‌న్న మూవీ

Hansika MotwaniPolice CaseShockingUpdatesViral
Comments (0)
Add Comment