Hai Nanna Movie : డిసెంబ‌ర్ 7న హాయ్ నాన్న‌

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Hai Nanna : తండ్రి, కూతురి మ‌ధ్య బాండింగ్ ఎలా ఉంటుంద‌నే దానిని ఆస‌రాగా చేసుకుని తీసిన సినిమా హాయ్ నాన్న‌. ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని(Nani), ల‌వ్లీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శౌర్యువ్ ప‌రిచయం కాబోతున్నాడు.

Hai Nanna Movie Release Updates

ఇక సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్ , ట్రైల‌ర్, సాంగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌ధానంగా హృద‌యం , ఖుషీ ఫేమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేష‌మ్ అబ్దుల్ వ‌హాక్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్ప‌టికే చార్ట్ బ‌స్ట‌ర్ లో నిలిచాయి. ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా మూవీ పూర్త‌యింది. ఇక ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు మూవీ మేక‌ర్స్. ఇందులో ఫుల్ బిజీగా ఉన్నారు టీం. నాని, మృణాల్ తెగ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ మ‌రింత అంచ‌నాలు పెంచేలా చేస్తున్నారు.

ఇవాళ సినిమా తీయ‌డం ఒక ఎత్త‌యితే దానిని ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డం మ‌రో ఎత్తుగా మారింది. మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. హాయ్ నాన్న మూవీని డిసెంబ‌ర్ 7న ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ఇవాళ నేచుర‌ల్ స్టార్ నాని బోటులో ప్ర‌యాణం చేస్తున్న స్టిల్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : Anasuya Bhardwaj Viral : రంగ‌మ్మ‌త్త హ‌ల్ చ‌ల్

Comments (0)
Add Comment