Guttu Chappudu: బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్‌ విడుదల !

బ్రహ్మాజీ కుమారుడు ‘గుట్టు చప్పుడు’ టీజర్‌ విడుదల !

Guttu Chappudu: డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై టాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) కుమారుడు సంజయ్‌ రావ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా ‘గుట్టు చప్పుడు’. రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌ టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు మణీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమాను డాక్టర్‌ లివింగ్‌స్టన్‌ నిర్మిస్తున్నారు. ఆయేషాఖాన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. దీనిలో భాగంగా ‘గుట్టు చప్పుడు’ ప్రమోషన్లను షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ కు మంచి స్పందన వస్తోంది.

Guttu Chappudu Movie Updates

ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో నటుడు బ్రహ్మాజీ(Brahmaji) మాట్లాడుతూ… ‘టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ ను సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌ లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ కుదిరారు. భారీ బడ్జెట్‌ తో తీశారు.ఈ టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్‌ ఇవ్వలేదు’ అని నవ్వుతూ అన్నారు.

నిర్మాత లివింగ్‌ స్టన్‌ మాట్లాడుతూ… ‘డైరెక్టర్‌ మణీంద్రన్‌ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్‌ అయ్యాము. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్‌, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్‌ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. సినిమాలో ఇంకా మంచి స్టఫ్‌ ఉంది. క్లైమాక్స్‌ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తీశాం.’ అని ఆయన అన్నారు.

Also Read : Nag Ashwin: డ్యూన్‌ సినిమాకు కాపీ ‘కల్కి 2898 ఏడీ’ ? నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇదే !

BrahmajiGuttu Chappudu
Comments (0)
Add Comment