Guruvayoor Ambalanadayil: ఓటీటీలోనికి సూపర్ హిట్ మలయాళ ఫ్యామిలీ డ్రామా !

ఓటీటీలోనికి సూపర్ హిట్ మలయాళ ఫ్యామిలీ డ్రామా !

Guruvayoor Ambalanadayil: ప్రముఖ మాలీవుడ్ స్టార్, దర్శకుడు ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్రధాన పాత్రలో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘గురువాయూర్ అంబలనాదయిల్(Guruvayoor Ambalanadayil)’. E4 ఎట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ఫృథ్వీరాజ్ ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సిల్ జోసెఫ్, నిఖిలా విమ‌ల్, అన‌శ్వ‌ర రాజ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మే 16న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా రూ. 90 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లతో మంచి విజ‌యం సాధించింది. అంతేకాదు ఈ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన వాటిల్లో ఐదో మ‌ల‌యాళ‌ చిత్రంగా, హ‌య్యెస్ట్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆల్‌టైం 8వ‌ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. గ‌తంలో అంత్యాక్ష‌రి, జ‌య జ‌య జ‌య జ‌య‌హే చిత్రాలను రూపొందించిన‌ విపిన్ దాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

దీనితో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను జూన్ 27 నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్‌ కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. మాతృక మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ బాష‌ల్లోనూ అందుబాటులో ఉండ‌నుంది. సో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాంటి అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌, ఇబ్బందిక‌ర స‌న్నివేశాలు లేని ఈ చిత్రాన్ని ఈ వీకెండ్ మీ కుటుంబంతో కలిసి చూసేందుకు ‘గురువాయూర్ అంబలనాదయిల్(Guruvayoor Ambalanadayil)’ సిద్ధమౌతోందన్నమాట.

Guruvayoor Ambalanadayil – ‘గురువాయూర్ అంబలనాదయిల్’ కథేమిటంటే ?

దుబాయ్‌లో ఉద్యోగం చేసే విను రామ‌చంద్ర‌న్ బ‌సిల్ జోసెఫ్ కు కేర‌ళలో నివ‌సించే అనంద‌న్ ఫృథ్వీరాజ్ సుకుమార‌న్ చెల్లి అంజ‌లితో పెళ్లి కుదురుతుంది. అయితే అప్ప‌టికే ఐదేండ్ల క్రితం పార్వ‌తితో జ‌రిగిన‌ బ్రేక‌ప్ వినును బాగా వెంటాడుతుండ‌డంతో కాబోయే బావ అనంద‌న్ సాయంతో కాస్త రిలాక్స్ అవుతాడు. అయితే పెళ్లి వేడుక‌లు మొద‌లైన స‌మ‌యంలో మొద‌టిసారి ఆనంద‌న్‌, విను క‌లుసుకుంటారు. అప్పుడే త‌న ఆనంద‌న్ భార్య ఎక్స్ ల‌వ‌ర్ పార్వ‌తి నిఖిలా విమ‌ల్ అని తెల‌సుకుని విను షాక్ అవుతాడు. ఈ క్ర‌మంలో మొద‌ట్లో విను ఎలాగైనా పెళ్లిని క్యాన్స‌ల్ చేయాల‌ని స్నేహితులతో క‌లిసి ప్ర‌య‌త్నాలు చేయ‌డం, విష‌యం తెలిసిన కాబోయే భార్య అంజ‌లి మ‌ద్ద‌తుతో పెళ్లికి సిద్ద‌మ‌వ‌డం జ‌రుగుతాయి. తిరిగి అదే స‌మ‌యంలో ఆనంద‌న్‌ కు వాస్త‌వం తెలిసి బంధువుల సాయంతో ఆ పెళ్లిని క్యాన్స‌ల్ చేయ‌డం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తాడు. చివ‌ర‌కు ఈ స‌మస్య‌ తీరిందా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల మ‌ధ్య సినిమా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తూ చివ‌రివ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ప్ర‌తీ స‌న్నివేశం కామెడీని పంచుతూ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది.

Also Read : Rishab Shetty: ప్రభాస్ ‘బుజ్జి’ వాహనాన్ని నడిపిన కాంతార హీరో !

Disney Hot StarGuruvayoor AmbalanadayilPrithviraj Sukumaran
Comments (0)
Add Comment