Gunturu Karam Movie : తెలుగు సినీ రంగంలో అత్యంత జనాదరణ కలిగిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ సీన్స్ పై ఫోకస్ చేస్తే మనోడు కేవలం మాటలనే ఆయుధాలుగా వాడతాడు. వాటితోనే సినిమాలను తెరపై విజయవంతం అయ్యేలా చేస్తాడు. కె. విశ్వనాథ్ మూవీలు డిఫరెంట్ గా ఉండేవి.
Gunturu Karam Movie Status
అందులో ఎక్కువగా హీరో, హీరోయిన్ల మధ్యన కెమిస్ట్రీ ఉండీ ఉండనట్టు ఉండేది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో పాత్రలు ప్రాణంతో ఉంటాయి. అవి నిత్యం ప్రేక్షకులను వెంటాడేలా చేస్తాయి.
తను టీచర్. ఎందుకనో సాహిత్యం అంటే ఇష్టం. ఇంకేం సినిమా వైపు మనసు మొగ్గు చూపింది. పోసాని వద్ద అసిస్టెంట్ గా చేరాడు. ఆ తర్వాత మాటల రచయితగా ఛాన్స్ వచ్చింది. అదే స్వయం వరం. ఇందులో వేణు నటుడు. ఇక నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
ఇదే సమయంలో ఉన్నట్టుండి ప్రిన్స్ మహేష్ బాబుతో అతడు తీశాడు. అది సెన్సేషన్ హిట్ గా నిలిచింది. అనుష్కతో ఖలేజా తీశాడు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు, శ్రీలీలతో గుంటూరు కారం(Gunturu Karam) తీస్తున్నాడు. నవంవర్ 7 త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు. ఆయనకు 52 ఏళ్లు.
ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయినట్లు టాక్. చిత్రానికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Also Read : Animal Movie : వంగా యానిమల్ అప్ డేట్