Posani : ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై నోరు పారేసుకున్నందుకు జైలు పాలైన ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి(Posani) భారీ ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టేందుకు సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది గుంటూరు కోర్టు.
Posani Krishna Murali Got Bail
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయ స్థానం. పోసానికి బెయిల్ మంజూరు చేసినా ఫుల్ కండీషన్స్ పెట్టింది. ఇక నుంచి కేసు ముగిసేంత వరకు ఎక్కడా నోరు విప్ప కూడదని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడ కూడదంటూ ఆదేశించింది. సీఐడీ పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. తను ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దురుసుగా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలిపారు.
కాగా పోసాని కృష్ణ మురళికి చెందిన న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు. తన క్లయింట్ కావాలని ఎక్కడా కామెంట్స్ చేయలేదని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ. 2 లక్షల విలువ కలిగిన ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని స్పష్టం చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మీడియాతో కూడా మాట్లాడ కూడదని పేర్కొంది.
నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది పోసాని కృష్ణ మురళికి. కేసు దర్యాప్తునకు పోలీసులకు సహకరించాలని సూచించింది.
Also Read : Beauty Malavika : డార్టింగ్ ప్రభాస్ పర్ ఫెక్ట్ హీరో