Ram Gopal Varma Shocking :రామ్ గోపాల్ వ‌ర్మ‌కు సీఐడీ నోటీసులు 

స‌వాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ 

Ram Gopal Varma : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్ త‌గిలింది. గుంటూరు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి.

Ram Gopal Varma Got Notices from CID

మ‌రో వైపు రామ్ గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma)  త‌మ కులాన్ని, నాయ‌కుల‌ను కావాల‌ని కించ ప‌రిచేలా తీశాడ‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలో ప‌లు ఫిర్యాదులు అందాయి. విచార‌ణ‌కు రావాల్సిందిగా తాజాగా సీఐడీ నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదిలా ఉండ‌గా గ‌త వైసీపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్జీవీ వ్యూహం పేరుతో సినిమా తీశాడు. ఇందులో ప్ర‌త్యేకించి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నారా లోకేష్, త‌దిత‌రులను ఉద్దేశించి పాత్ర‌లు జొప్పించాడు.

మ‌రో వైపు ఎక్స్ వేదిక‌గా సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల ఆ  మ‌ధ్య తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం , స్టార్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్, సోద‌రుడు నాగబాబు కొణిద‌ల‌. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుతం పోసాని కృష్ణ ముర‌ళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న‌ను రోజుకో పోలీస్ స్టేష‌న్ కు తిప్పుతున్నారు. త‌న‌పై ఇప్ప‌టికే 17 కేసులు న‌మోద‌య్యాయి.

Also Read : Ranya Rao Shocking :న‌టి ర‌న్యా రావుకు 14 రోజుల క‌స్ట‌డీ

CIDNoticesPolice CaseRam Gopal VarmaUpdatesViral
Comments (0)
Add Comment