Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సత్తాను చాటుతోంది. ఇప్పటివరకు సుమారు రూ. 164 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ‘గుంటూరు కారం’… ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతుంది.
Guntur Kaaram Success Party Viral
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు… ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ ఎంజాయ్ ని ఆయనొక్కడే కాకుండా.. ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ టీమ్‌కు ఆయన గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి రోజు రాత్రి… మహేష్ బాబు తన టీమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీను తన ఇంట్లో నిర్వహించారు. ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ టీమ్‌తో పాటు తనకు అత్యంత సన్నిహితులైన వారిని మాత్రమే మహేష్ ఈ పార్టీకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి రోజు రాత్ర తన ఇంట్లో స్వయంగా మహేశ్ ఇచ్చిన ఈ గ్రాండ్ పార్టీకి హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి… నిర్మాతలు దిల్ రాజు, దిల్ రాజు వైఫ్, శిరీష్, నాగవంశీ హాజరయ్యారు. అలాగే మహేశ్ కు అత్యంత సన్నిహితులైన దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ టీమ్ తో మహేష్ గారాల పట్టి సితార కూడా చక్కగా ఎంజాయ్ చేసింది. ఈ పార్టీకి హాజరైన అతిథులకు మహేష్ వైఫ్ నమ్రత దగ్గరుండి మరీ… అన్ని ఎరేంజ్‌మెంట్స్ చూసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలలో దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
Also Read : Vikram Thangalaan: విక్రమ్ ‘తంగలాన్’ వాయిదా !