Guntur Kaaram Review : గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అంటున్న ప్రేక్షకులు

బ్లాక్ బస్టర్ సినిమా అంటున్న ఫ్యాన్స్

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ అంటే అభిమానుల్లో ఎంతటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో దాదాపు 14 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమాతో కనిపించింది. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. “కుర్చీ మడతపెట్టి ” పాట చాలా ట్రెండీగా ఉంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈరోజు (జనవరి 12) ‘గుంటూరు కారం’ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. అర్థరాత్రి, గంట షో ముగిసిన తర్వాత, అభిమానులు ట్విట్టర్‌లో విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. బాబుకు పెద్ద హిట్ అని కొందరు వ్యాఖ్యలు చేసారు.

Guntur Kaaram Review Viral

బ్లాక్ బస్టర్ సినిమా. మహేష్ బాబు వన్ మ్యాన్ షో. గుంటూరు కారం(Guntur Kaaram) గురించి ట్విట్టర్‌లో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు-వెన్నెల కిషోర్ మధ్య చాలా కామెడీ ఉందని అంటున్నారు. శ్రీలీలా డ్యాన్స్‌అదరగొట్టేసిందని… సూపర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి.మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఫస్ట్ హాఫ్ బెస్ట్ గా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్, సెకండాఫ్‌లో ఎమోషనల్‌ క్లైమాక్స్‌ సీన్‌ హైలైట్‌. మొత్తంమీద, ఇది హిట్ బొమ్మగా రివ్యూలు ఇస్తున్నారు. రమణ గాడి మాస్ జాతర సూపర్ అంటూ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో చెప్తున్నారు.

మహేష్ బాబు వన్ మ్యాన్ షోని చాలా బాగా ఎంజాయ్ చేశామని… మరిచిపోలేని సీన్లు చాలా ఉన్నాయని… ఇదే నేపథ్యంలో సంగీతం కూడా చాలాబావుందంటూ రివ్యూ ఇచ్చారు. ఈ రివ్యూల ప్రకారం గుంటూరు కారం బ్లాక్ బస్టర్. ఈ సినిమా డీసెంట్‌గా ఉందని అంటున్నారు. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అద్భుతం.

Also Read : Nayanatara: నెట్ ఫ్లిక్స్ లో ఆగిపోయిన నయనతార సినిమా !

Guntur KaaramReviewsSuper Star Mahesh BabuTrendingUpdatesViral
Comments (0)
Add Comment