Guntur Kaaram Updates : ఒక్కో అప్డేట్ తో ‘గుంటూరు కారం’ సినిమా మీద భారీగా అంచనాలు రేపుతోంది చిత్రయూనిట్. ముఖ్యంగా చాలా కాలం తరవాత అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉండటం ఆడియెన్సును అట్ట్రాక్ట్ చేస్తోంది.
Guntur Kaaram Movie Updates
వీటన్నిటిని మించి నిర్మాత నాగ వంశీ ఇస్తున్న అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లొ తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram). సంక్రాంతికి కానుకగా రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు డబల్ చేసేలా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు నిర్మాత నాగ వంశీ .
తాజాగా మీడియాతో మాట్లాడిన నిర్మాత నాగ వంశీ సినిమా కంటెంట్ గురించి కీలక విషయాలు రివీల్ చేసారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ రిఫరెన్సులు కూడా ఉండబోతున్నాయి అని చెప్పారు, సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ డైలాగ్ ఒకటి మహేష్ నోట వినిపిస్తుంది అన్న హిన్ట్ ఇచ్చారు, ఇక ఇంటర్వెల్ సీన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుందని సూపర్ స్టార్ అభిమానులకు ఫుల్ ట్రీట్ లా ఇంటర్వెల్ బ్యాంగ్ ను సిద్ధం చేసినట్లుగా చెప్పారు.
సెకండ్ హాఫ్ లో వచ్చే మరో ఫైట్ మాస్ సాంగ్స్ లో మహేష్ డాన్సులు కూడా అభిమానులను అలరిస్తాయన్నారు. ఇక చివరి నలబైఐదు నిమిషాలు సినిమాకి హైలైటుగా నిలుస్తాయని అన్నారు నాగవంశీ, ఆ ఎపిసోడ్లో ఎమోషన్స్ యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్టుగా ఉంటాయని చెప్పారు. ఓవరాల్ గా ‘గుంటూరు కారం’ పక్కా పొంగల్ సినిమాగా ప్రేక్షకులముందుకు రాబోతోందని హామీ ఇచ్చారు నిర్మాత.
Also Read : Kajal Aggarwal : వైరల్ అవుతున్న కాజల్ లిప్ లాక్ ఫోటో