Guntur kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంతో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం(Guntur kaaram)’. అతడు, ఖలేజా తరువాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా చాలు అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. దసరా సందర్భంగా ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది.
Guntur kaaram Updates
అప్ డేట్ ఇచ్చేంత సమయం కూడా లేకుండా షూటింగ్ చేస్తున్నామంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ చెప్పడంతో అభిమానులు కాస్తా నిరాశపడ్డారు. అయితే అభిమానుల నిరాశ అర్ధం చేసుకున్న చిత్ర యూనిట్ దీపావళికి ముందే ‘గుంటూరు కారం’ సర్‌ప్రైజ్‌ను రెడీ చేసింది. దీపావళి కానుకగా మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం ‘దమ్ మసాలా’ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో మహేశ్‌బాబు అభిమానులు ఖుషీ అవున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జయం రవి, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Kannappa: కన్నప్పలో కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్