Guntur Kaaram Records: విడుద‌ల‌కు ముందే గుంటూరు కారం రికార్డుల మోత !

విడుద‌ల‌కు ముందే గుంటూరు కారం రికార్డుల మోత !

Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల మోత మ్రోగిస్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 39 మిలియ‌న్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి సినిమాగా రికార్డుల‌కెక్కింది. 07.01.2024 (ఆదివారం) రాత్రి 9.09 నిమిషాల‌కు చిత్ర యూనిట్ ఈ సినిమా థియేట్రికల్ టైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా 08.01.2024 (సోమవారం) రాత్రి 9.09 నిమిషాలు అయ్యేసరికి ఈ ట్రైలర్ దాదాపు 40 మిలియ‌న్ల మంది వీక్షించిన‌ట్లు చిత్ర యూనిట్ సోష‌ల్‌మీడియా వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట వైర‌ల్ కావడంతో పాటు అల్‌టైమ్ రికార్డ్ పేరిట ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Guntur Kaaram Movie Updates

గుంటూరు కారం(Guntur Kaaram) త‌ర్వాత స‌లార్ 24 గంట‌ల్లో 32.58 M, స‌ర్కారు వారి పాట 26.77 M, రాధేశ్యాం 23.3 M, ఆచార్య 21.86M, బాహుబ‌లి 2 21.81M, RRR 20.45 M, KGF2 19.38 M, బ్రో ది అవ‌తార్ 19.25 M వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. అయితే గుంటూరుకారం 40 మిలియ‌న్ వ్యూస్ అంటే 4 కోట్ల వ్యూస్‌తో పాటు 7 ల‌క్ష‌ల లైకులు, 30.కే కామెంట్లు సాధించడం కూడా ఓ రికార్డు అంటూ మ‌హేశ్‌బాబు ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ‘గుంటూరు కారం’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు విశేషమైన స్పందన రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అతడు, ఖలేజా తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో… సినిమా కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Salaar Collections: రూ. 700 కోట్లు మార్కు దాటిన సలార్‌ కలెక్షన్స్‌ !

Guntur KaaramMahesh Babu
Comments (0)
Add Comment