Oscar Awards: వందో ఆస్కార్‌ కి నాలుగు వేల కోట్లు బడ్జెట్ !

వందో ఆస్కార్‌ కి నాలుగు వేల కోట్లు బడ్జెట్ !

Oscar Awards: చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద అవార్డుల పండుగ ఆస్కార్(Oscar Awards). చలన చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని విభాగాల్లో ప్రతిభావంతులైన నటీ,నటులు, సాంకేతిక నిపుణులు, సినిమాలకు ఈ ఆస్కార్ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. దీనితో ప్రతీఏటా సాగే ఈ అవార్డులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1928లో ప్రారంభైమన ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం… ప్రతీ ఏటా నిర్వారామంగా కొనసాగుతూ శతాబ్ది ఉత్సవాల వైపు దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో 2028లో నిర్వహించబోయే నూరవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుండే సన్నాహాలు చేస్తున్నారు.

Oscar Awards  Update

అయితే 2028లో జరగనున్న ఈ వేడుకల కోసం ఆస్కార్‌ నిర్వాహకులు ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తుండటం హాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆస్కార్‌ 100’ పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లుగా రోమ్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆస్కార్‌ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ఆస్కార్‌ 100’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్ల క్యాంపైన్‌ (దాదాపు రూ. నాలుగు వేల కోట్లు)ను లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాదిన్నరలో ఇప్పటికే ‘ఆస్కార్‌ 100’ కోసం వంద మిలియన్‌ డాలర్లను సేకరించాం. ‘ఆస్కార్‌ 100’ ఈవెంట్‌ను వినూత్నంగా ప్లాన్‌ చేస్తున్నాం. ఈ వేడుకల సందర్భంలోనే మరో వంద సంత్సరాల పాటు ఆస్కార్‌ అవార్డు వేడుకలను ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుని, ఓ అవగాహనకు రావాలనుకుంటున్నాం’’ అని ఆస్కార్‌ కమిటీ ప్రస్తుత సీఈవో బిల్‌ క్రామోర్‌ చెప్పుకొచ్చారు. ఇక 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలు వచ్చే ఏడాది మార్చి 2న జరగనున్న విషయం తెలిసిందే.

Also Read : Ajith Kumar: అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా షురూ !

Oscar AwardsRRR
Comments (0)
Add Comment