Gopichand Malineni : కథను ఎంచుకోవడం, దానికి తగ్గట్టు దుమ్ము రేపేలా సినిమా తీయడంలో తనకు తనే సాటి టాలీవుడ్ కు చెందిన దర్శకుడు గోపిచంద్ మలినేని(Gopichand Malineni). తన టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఇస్తూనే హీరోకు మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఇది తన ప్రత్యేకత. తనతో పని చేసేందుకు ప్రతి హీరో ఇష్ట పడతాడు. తనతో నటించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవు. చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతామని ఆ మధ్యన చిట్ చాట్ సందర్బంగా చెప్పాడు మాస్ మహారాజా రవితేజ.
Gopichand Malineni Movie Updates
తనతో నటించిన శ్రుతీ హాసన్ సైతం గోపిచంద్ మలినేనిని ప్రశంసలతో ముంచెత్తింది. తను తీసినవి కొన్ని సినిమాలే కావచ్చు కానీ డేరింగ్, డేషింగ్ , డైనమిక్ హీరోలో ఉండేలా జాగ్రత్త పడతాడు. కాస్తంత తను తీయబోయే మూవీస్ లో హింస ఎక్కువగా ఉన్నప్పటికీ అది కథలో భాగం అవుతుందే తప్పా కావాలని చేయనంటూ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు దర్శకుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు మలినేని గోపిచంద్.
ఇక సినిమాల పరంగా చూస్తే రవితేజ, శ్రియాతో డాన్ శ్రీనుతో ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వెంకటేశ్, త్రిషతో బాడీ గార్డ్, 2013లో రవితేజ , శ్రుతీ హాసన్ తో బలుపు, 2015లో రామ్ పోతినేని, రకుల్ తో పండగ చేస్కో, 2017లో సాయి ధరమ్ తేజ్, రకుల్ తో విన్నర్ , 2020లో క్రాక్ రవితేజ, శ్రుతి మాసన్ , 2023లో వీర సింహా రెడ్డి బాలకృష్ణ, శ్రుతి హాసన్ తో తీశాడు. అన్నీ బిగ్ సక్సెస్ అయ్యాయి. తాజాగా హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సన్నీ డియోల్, రెజీనా కాసాండ్రా, రణదీప్ హూడా తో జాట్ తీశాడు.
Also Read : Rajendra Prasad Shocking :డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ సారీ