Good Bad Ugly : తమిళ సినీ హీరో అజిత్ కుమార్, లవ్లీ బ్యూటీ త్రిష కృష్ణన్ కలిసి నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) దూసుకు పోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయి కంటే కలెక్షన్లు సాధిస్తోంది ఈ చిత్రం. ఫస్ట్ డే రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 60 కోట్లను సాధించింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. చిత్రం పూర్తిగా గ్యాంగ్ స్టర్ రెడ్ డ్రాగన్ చుట్టూ తిరుగుతుంది. తన కొడుకు తప్పుగా అరెస్ట్ కావడంతో తిరిగి తన పాత మార్గాన్ని ఎంచుకోవడం ఇందులో ప్రధానమైన కథ.
Hero Ajith ‘Good Bad Ugly’ Movie Collections
తమ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు , అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు నటుడు అజిత్ కుమార్. ఇదే సమయంలో ఈ ఏడాది తన చిత్రాలు రెండు విడుదలయ్యాయి. వాటిలో తొలి మూవీ విదాముయార్చి. ఇందులో కూడా త్రిష కృష్ణన్ కీ రోల్ పోషించింది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. బిగ్ డిజాస్టర్ గా నిలిచింది.
అజిత్ కుమార్ నేతృత్వంలోని యాక్షన్ సినిమా టికెట్ విండోల ద్వారా రూ. 18.5 కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ నివేదించింది అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కలెక్షన్ ఇప్పుడు రూ. 62.75 కోట్లుగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆక్యుపెన్సీ శాతం 61.53గా ఉంది. ఉదయం షోలకు 41.58 శాతంగా ఉండగా మధ్యాహ్నం షోస్ కు 62.51గా ఉంది. సాయంత్రం 64.04 శాతంగా ఉండగా రాత్రి వేళల్లో 78.99 శాతంగా ఉందని తెలిపింది.
Also Read : Popular Director Rajamouli :జక్కన్న మూవీకి డైలాగ్ రైటర్ గా దేవ కట్టా