Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

అయితే..పోటీగా నిలవాల్సిన టీములు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం గమనార్హం...

Daaku Maharaaj : ప్రతి ఏడాది సంక్రాంతి రేసులో నిలవడమే కాకుండా విజేతగా నిలుస్తూ వస్తున్న నందమూరి బాలకృష్ణ ఈ సారి కూడా ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’తో రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ మూవీతో పాటు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో గట్టి పోటీని ఎదురుకోనున్నాడు. శనివారం అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన డల్లాస్ లో ల్యాండ్ అయ్యారు. ఇదే వేదికపై సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ ట్రైలర్ కట్ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ బాలయ్య టీమ్ కి అండగా నిలవనుంది.

Daaku Maharaaj Movie Updates

అయితే..పోటీగా నిలవాల్సిన టీములు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. కాగా, డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ట్రైలర్ ని గేమ్ ఛేంజర్ ఎడిటర్ రూబెన్ కట్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ని కట్ చేసేందుకు డైరెక్టర్ బాబీ.. రూబెన్ ని అప్రోచ్ అయ్యాడు. దీనికి రూబెన్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతూ.. ట్రైలర్ కట్ సిద్ధం అయ్యిందని కన్ఫర్మ్ చేశాడు. డాకు మహారాజ్ ట్రైలర్ అదిరిపోయినట్లుగా తెలిపాడు. డైరెక్టర్ బాబీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. దీంతో బాలయ్య అభిమానులు సంబరపడిపోతున్నారు.

మరోవైపు..చిరంజీవి, బాలకృష్ణలతో వర్క్‌ చేయడం ఎలా ఉందని డైరెక్టర్ బాబీని ప్రశ్నించగా ఇద్దరూ గొప్ప నటులు. వాళ్లను డైరెక్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉంటున్నారో.. ఈ చిత్రంలో అలానే ఉంటారు. ఇందులో విజువల్స్‌ చాలా బాగుంటాయి. బాలకృష్ణ డైరెక్టర్‌ ఏం చెబితే అది చేస్తారు. షూటింగ్‌ సమయంలో ఏదైనా దెబ్బ తగిలినా ఎవరికీ చెప్పరు. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. అందరూ ఆశ్చర్యపోతారు. థియేటర్‌ దద్దరిల్లిపోయే మాస్‌ సాంగ్‌ ఉంటుంది.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

Daaku Maharaajgame changerTrendingUpdatesViral
Comments (0)
Add Comment