Ghost Movie : భ‌య పెడుతున్న శివ‌న్న

దూసుకు పోతున్న ఘోస్ట్

Ghost Movie : క‌న్న‌డ సినీ రంగంలో త‌న‌కంటూ ఎదురే లేని న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శివ‌న్న అలియాస్ శివ రాజ్ కుమార్. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ త‌న‌యుడు. త‌న సోద‌రుడు ప‌ప్పు కూడా గొప్ప న‌టుడే. త‌ను గుండె పోటుతో చిన్న వ‌య‌సులో కాలం చేశాడు. చ‌ని పోయి 2 ఏళ్ల‌వుతోంది. ఈ ఏడాది శివ రాజ్ కుమార్ కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది త‌మిళంలో వ‌చ్చిన జైల‌ర్.

Ghost Movie Updates

దీనికి ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్. ఈ చిత్రంలో సూపర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ , శివ రాజ్ కుమార్ , ర‌మ్య కృష్ణ‌న్ , యోగి బాబు న‌టించారు. విల‌న్ పాత్ర‌లో మ‌ల‌యాళం స్టార్ మోహ‌న్ లాల్ కూడా న‌టించ‌డం ప్ర‌త్యేక‌త‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 650 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

తాజాగా క‌న్న‌డ‌లో తీసిన ఘోస్ట్(Ghost Movie) లో కీ రోల్ పోషించాడు శివ‌న్న‌. ఇప్పుడు ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కించాడు ఎంజీ శ్రీ‌నివాస్. రూ. 15 కోట్ల‌తో ఈ సినిమా తీశాడు. సందేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నాగ‌రాజ్ నిర్మించారు. అనుప‌మ్ ఖేర్ , జ‌య‌రాం, ప్ర‌శాంత్ నారాయ‌ణ్ , అర్చ‌న జోయిస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. దీనిని తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు.

ఇందులో శివ‌న్న గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో పోషించాడు శివ రాజ్ కుమార్.

Also Read : Leo Movie : నెట్ ఫ్లిక్స్ లో విజ‌య్ లియో

Comments (0)
Add Comment