GHMC Shocking Decision :జీహెచ్ఎంసీ షాక్ తాజ్ బంజారా హోట‌ల్ సీజ్

రూ. 1.43 కోట్ల ప‌న్ను చెల్లించ‌నందుకు చ‌ర్య‌లు

GHMC : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు న‌గ‌రంలోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ బంజారా హోట‌ల్ ను సీజ్ చేసింది. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ప‌న్ను చెల్లించాల‌ని నోటీసులు జారీ చేశామ‌ని, అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పైసా కూడా చెల్లించ లేద‌ని స్ప‌ష్టం చేసింది జీహెచ్ఎంసీ.

GHMC Shocking Decision

నోటీసులు ఇచ్చినా స్పందించ‌క పోవ‌డం, బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా రూ. 1 కోటి 43 ల‌క్ష‌ల రూపాయ‌లు పన్ను రూపేణా చెల్లించాల్సి ఉంద‌ని వెల్ల‌డించింది. నోటీసులు స‌ర్వ్ చేసినా స్పందించ లేద‌ని, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని, అందుకే హొట‌ల్ ను సీజ్ చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

దీంతో తాజ్ బంజారా హోట‌ల్ ప్ర‌ధాన ద్వారానికి తాళం వేయ‌డం జ‌రిగింద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు వెల్ల‌డించారు. బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని, కానీ వారి నుంచి స్పందన లేకపోవడం వల్ల ఈ చర్య అవసరమైందని అధికారులు నొక్కి చెప్పారు. నగరంలోని వాణిజ్య సంస్థల నుండి పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులను వసూలు చేయడానికి GHMC కొనసాగుతున్న ప్రయత్నాల తర్వాత ఈ జప్తు జరిగింది.

Also Read : Popular Cricketer Sourav Ganguly :దాదాకు త‌ప్పిన ప్ర‌మాదం

GHMCUpdatesViral
Comments (0)
Add Comment