Beauty Genelia : హ్యాపీ బ‌ర్త్ డే ఫ్లాషు బాయ్

ఆనందం పంచుకున్న జెనీలియా

Genelia : ముంబై – జెనీలియా దేశ్ ముఖ్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ఎక్కువ‌గా సినిమాల కంటే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ మ‌ధ్య‌న ఇన్ స్టా గ్రామ్ లో ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఖాతా తెరుస్తున్నారు. దీనికి కార‌ణం ఏమిటంటే ఎంత మంది ఎక్కువ పాలోవ‌ర్స్ ఉంటే వారికి అన్ని డ‌బ్బులు వ‌స్తాయి.

Genelia Insta Post Viral

దీంతో ఎలాగైనా స‌రే ఇన్ ఫ్లూయ‌ర్స్ గా మారాల‌ని తెగ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అత్య‌ధికంగా ఇన్ స్టా నుంచి సంపాదిస్తోంది భార‌త దేశంలో క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ. త‌ను ఎప్పుడూ ఓట‌మిని తేలిక‌గా ఒప్పుకోడు. త‌న‌కు సంబంధించిన ఫోటోల కోసం జ‌నం పిచ్చెక్కి పోతున్నారు.

ఇదే స‌మ‌యంలో ముంబై నుంచి న‌టీ న‌టులు రోజుకో అప్ డేట్స్ ఇస్తూ త‌మ‌ను తాము ప్ర‌జెంట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఆనందాన్ని పంచుతున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న జెనీలియా(Genelia) దేశ్ ముఖ్ ఆస‌క్తిక‌ర ఫోటోను షేర్ చేశారు.

జెనీలియాకు , త‌న భ‌ర్త‌కు పిల్ల‌ల‌కు కుక్క‌ల‌న్నా, పిల్ల‌ల‌న్నా చ‌చ్చేంత ఇష్టం. ఈ సంద‌ర్బంగా త‌మ ఇంట్లో 11 ఏళ్ల పాటు ఇంట్లో ఉండి పోయిన బొచ్చు తో కూడిన ఫ్లాషు బాయ్ గురించి ఆస‌క్తిక‌రంగా స్పందించింది. త‌నకు ఇన్నేళ్లు నిండాయంటే ఆశ్చ‌ర్యంగా ఉందంటోంది ఈ ముద్దుగుమ్మ‌. నిన్ను ఆయిగా ఎంచుకున్నందుకు మ‌రింత ఆనందంగా ఉందంటూ పేర్కొంది ఇన్ స్టా వేదిక‌గా .

Also Read : Rakul Preet Singh Surprising Gift :స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ర‌కుల్ ప్రీత్ సింగ్ దిల్ ఖుష్

CommentsGenelia D'souzaInsta PostViral
Comments (0)
Add Comment