Gautham Vasudev Shocking : ఎక్కువ కాలం ప‌ని చేయ‌లేక పోవ‌చ్చు

త‌మిళ ఇండ‌స్ట్రీపై గౌత‌మ్ మీన‌న్ కామెంట్స్

Gautham Vasudev : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్(Gautham Vasudev) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గత కొంత కాలం నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన ప‌ని లేదు. కొంద‌రు న‌టుల ప‌ట్ల ఆయ‌న ఎందుక‌నో గుర్రుగా ఉన్నారు. ఈ మ‌ధ్య‌న త‌ను చేసిన సినిమాలు అంత‌గా ఆడ‌క పోవ‌డం కూడా కావ‌చ్చు. ఇది ప‌క్క‌న పెడితే ద‌ళ‌పతి విజ‌య్ , త్రిష కృష్ణ‌న్ తో క‌లిసి న‌టించారు.

Gautham Vasudev Menon Shocking Comments

ఇక గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగిన ద‌ర్శకుడిగా గుర్తింపు పొందారు. త‌ను త‌మిళం, తెలుగు, మ‌ల‌యాలం ప్రేక్ష‌కుల‌కు చిర‌ప‌రిచితుడే. అత్యంత జ‌నాద‌ర‌ణ‌, సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన సినిమాల‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్.

ఏం మాయ చేశావే సినిమా వెండి తెర మీద ఎప్ప‌టికీ గుర్తుండి పోయే మూవీ. యాక్ట‌ర్ గా, స్క్రీన్ రైట‌ర్ గా, ద‌ర్శ‌కుడిగా, ప్రొడ్యూస‌ర్ గా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌స్తుతం త‌ను మమ్ముట్టి ప్ర‌ధాన లీడ్ లో మ‌ల‌యాళంలో డొమినిక్ అండ్ ది లేడీస్ ప‌ర్స్ చిత్రం తీస్తున్నాడు. ఈ సంద‌ర్బంగా త‌మిళ న‌టులతో విసిగి పోయాన‌ని, ఇక తాను అక్క‌డ సినిమాలు తీయ‌క పోవ‌చ్చన్నాడు.

Also Read : Kumbh Mela – Beauty Monalisa : కుంభ మేళా మోనాలిసాకు మూవీ ఆఫ‌ర్

CommentsGautham Vasudev MenonShockingViral
Comments (0)
Add Comment