Popular Director Gautham Menon : ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ భావోద్వేగం

స‌క్సెస్ ఉన్న‌ప్పుడే ఆద‌రిస్తార‌ని కామెంట్

Gautham Menon : సినిమా అంటేనే అదో రంగుల లోకం. బాగున్న‌ప్పుడే అంతా. స‌క్సెస్ ఉన్న‌ప్పుడే ప‌ల‌క‌రింపులు ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారంటూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు ప్ర‌ముఖ త‌మిళ చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్(Gautham Menon). త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన ద‌ర్శ‌కుల‌లో త‌ను కూడా ఒక‌రు. దేశ వ్యాప్తంగా త‌న సినిమాల‌కు ఓ స్పెషాలిటీని స్వంతం చేసుకున్నాడు డైరెక్ట‌ర్.

Gautham Menon emotional Comment

ఏ సినిమా తీసినా వెరీ స్పెష‌ల్ గా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చాడు. త‌ను త‌ళ‌ప‌తి విజ‌య్ తో క‌లిసి న‌టించాడు. ఈ సంద‌ర్బంగా ఓ ఛాన‌ల్ తో మాట్లాడాడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్. మ‌నం విజ‌య‌ప‌థంలో ఉన్న‌ప్పుడే జ‌నం మ‌న కోసం వేచి చూస్తార‌ని, కానీ ఒక అడుగు వెన‌క్కి వేస్తే ఇక మ‌న కోసం ఎవ‌రూ సాయం చేసేందుకు ముందుకు రారంటూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు.

ఇక ద‌ర్శ‌కుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ద‌క్షిణాది చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తీశాడు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు అందించాడు. 2001లో మాధ‌వ‌న్ , రీమా సేన్ తో మిన్నెలే సినిమా తీశాడు. త‌న సినీ కెరీర్ లో ఇదే తొలి చిత్రం. ఏం మాయ చేశావే పేరుతో తెలుగులో నాగ చైత‌న్య‌, స‌మంత రుత్ ప్ర‌భుతో చేసిన మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ బిగ్ హిట్ అయ్యాయి. ఇందులోని డైలాగుల గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఆ త‌ర్వాత తీసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో త‌ను నిరాశ‌కు గుర‌య్యాడు. తాను తీసిన ధ్రువ నక్ష‌త్రం ఆద‌రించ‌క పోవ‌డానికి కూడా కొంత బాధ క‌లిగించింద‌న్నాడు.

Also Read : Beauty Anshu : డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు మంచోడు – అన్షు అంబానీ

Commentsgowtham menonUpdatesViral
Comments (0)
Add Comment