Garimella Balakrishna Prasad : తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విధ్వాంసుడిగా పని చేసిన ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(Garimella Balakrishna Prasad) ఆదివారం గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన జీవితమంతా ఆ శ్రీవారి సేవకు అంకితం అయ్యారు. ఎంతో కష్టపడి అన్నమాచార్య కీర్తనలను వెలుగులోకి తీసుకు వచ్చారు. గరిమెళ్ల తన అద్భుతమైన గానామృతంతో కోట్లాది భక్తుల మనసు దోచుకున్నారు. ఆ సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడికి తన స్వరంతో అభిషేకం చేశారు. నిత్యం తన పాటలతో, సంకీర్తనలతో నేటికీ తిరుమల అలరారుతూ ఉంటుంది. ఆయన వయసు 76 ఏళ్లు. దాదాపు 1000కి పైగా గీతాలు పాడారు. అన్నమాచార్య ప్రాజెక్టుకు ప్రాణం పోశారు.
Garimella Balakrishna Prasad No More..
కర్ణాటక సంగీతంలో పట్టు సాధించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(Garimella Balakrishna Prasad) శాస్త్రీయ, సంగీత గాయకుడిగా, స్వరకర్తగా గుర్తింపు పొందారు. 1970 నుంచి ఆ శ్రీవారి సేవలోనే నిమగ్నం అయ్యారు. నవంబర్ 9, 1948లో పుట్టారు. టీటీడీలో 1978 నుంచి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా పని చేశారు. వినరో భాగ్యము, జగడపు చనువుల జాతర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ద కీర్తనలకు గరిమెల్ల ప్రాణం పోశారు. తన జీవిత కాలంలో 6000 కు పైగా కచేరీలు చేశారు. టీటీడీ కోసం ఆడియో రికార్డింగ్ లు చేశాడు. పుస్తకాలను ప్రచురించారు.
అన్నమాచార్య కృతులకు ప్రాచుర్యం కల్పించేందుకు శిక్షణ తరగతులు చేపట్టారు. ఒక రోజుకు ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఆయన ప్రత్యేకత. హరి సంకీర్తనం ద్వారా సామాన్యులకు అన్నమయ్య కీర్తలను నేర్పించాడు. సిలికాన్ ఆంధ్ర, ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో లక్ష గళార్చన చేపట్టారు. స్వయంగా వాగ్గేయ కారుడు కావడంతో హనుమంతుడిపై ఆంజనేయ కృతి మాల, వినాయకుడి కృతులతో పాటు ఇతర దేవతలపై కూడా కృతులు రచించాడు. సినిమా గాయని జానకికి మేనల్లుడు అవుతారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. ఆయన మృతితో గొప్ప గాయకుడినే కాదు అద్భుతమైన భక్తుడిని కోల్పోయింది తిరుమల.
Also Read : Popular Politician Vijayashanti :ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములమ్మ