Game Changer : డల్లాస్ ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ లో అభిమానుల పై ప్రశంసలు కురిపించిన చరణ్

మీరు స్వాగతం పలికిన తీరుకు ఆశ్చర్యపోయాను...

Game Changer : శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించిన భారీ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అద్వాణీ హీరోయిన్‌. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా యూఎ్‌సలోని డల్లా్‌సలో మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులతో ఏర్పాటు చేసిన అత్మీయ సమ్మేళనంలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘ఇక్కడి వారు చూపించిన అభిమానానికి మాటలు రావడం లేదు.

Game Changer Movie Updates

మీరు స్వాగతం పలికిన తీరుకు ఆశ్చర్యపోయాను. ఆంధ్ర, తెలంగాణలో ఉన్నామా లేక డల్లాస్‌ వచ్చామా అని కూడా అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచే మూవీ ప్రమోషన్స్‌ను మెదలుపెడుతున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని అన్నారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను పెట్టినప్పుడే సరికొత్తగా ప్రమోషన్స్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా డల్లా్‌సను ఎంపిక చేసుకున్నాం. ఇక్కడ ఈవెంట్‌ నిర్వహణకు రాజేశ్‌ ముందుకొచ్చి సహకరించారు’ అని చెప్పారు.

Also Read : The Roshans : బాలీవుడ్ నుంచి వస్తున్న ‘ది రోషన్స్’ డాక్యుమెంటరీ

Cinemagame changerGlobal Star Ram CharanTrendingUpdatesViral
Comments (0)
Add Comment