Hero Charan-Game Changer :అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజ‌ర్

డేట్ క‌న్ ఫ‌ర్మ్ చేసిన మూవీ మేక‌ర్స్

Game Changer : దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గేమ్ ఛేంజ‌ర్(Game Changer) మూవీ ఆశించిన మేర రాణించ లేక పోయింది. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చ‌ర‌ణ్ న‌టించినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మోష‌న్ లో పాల్గొన్నా, చిరంజీవి స‌పోర్ట్ చేసినా చివ‌రకు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెల‌వ‌లేక పోయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ న‌టించినా వ‌ర్క‌వుట్ కాలేదు. సినిమా ఫెయిలైనా అద్వానీకి సినిమాల‌లో బంప‌ర్ ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డం విశేషం.

Game Changer Movie OTT Updates

ఇక రామ్ చ‌ర‌ణ్ కు ఆర్ఆర్ఆర్ త‌ర్వాత వ‌చ్చిన ఈ మూవీపై పెట్టుకున్న ఆశల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీలో న‌టిస్తున్నాడు. తాజాగా గేమ్ ఛేంజ‌ర్ కు సంబంధించి కీల‌క‌మైన అప్ డేట్ వ‌చ్చింది. ఈ మేర‌కు ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుంద‌నే ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు.

అంద‌రూ ఓటీటీలో ప్రేమికుల రోజు ఫిబ్ర‌వ‌రి 14న వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ అంత‌కు ముందుగానే ఫిబ్ర‌వ‌రి 7నే గేమ్ ఛేంజ‌ర్ స్ట్రీమింగ్ అయ్యేందుకు ఒప్పందం కుదిరింద‌ని స‌మాచారం. అమెజాన్ ప్రైమ్ ఈ మేర‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో మెగా, చెర్రీ ఫ్యాన్స్ ఓటీటీలో చూసేందుకు రెడీ అయ్యారు. ఇక రూ. 500 కోట్లు పెట్టి తీసిన దిల్ రాజుకు గుండె గుభేల్ మంది. కానీ త‌ను తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

Also Read : Beauty Jannat Zubair: బుల్లి తెర‌పై జ‌న్న‌త్ జుబైర్ సూప‌ర్

game changerGlobal Star Ram CharanOTTTrendingUpdates
Comments (0)
Add Comment