Game Changer : అభిమానులకు మరోసారి నిరాశ మిగిల్చిన ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్‌. గ్రాఫిక్స్ వర్క్‌ కూడా భారీగా ఉంది..

Game Changer : అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్‌. దసరా టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌కి అలాంటిదేం లేదంటూ షాక్ ఇచ్చింది యూనిట్‌. అయితే కాసత్ ఆలస్యమైన ఈ వెయిటింగ్ వర్తే అంటూ మరోసారి ఫ్యాన్స్‌ను కన్విస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌. ఆడియన్స్‌కు మరోసారి షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్(Game Changer) టీమ్‌. దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా చాట్‌ సెషన్‌లో పాల్గొన్న తమన్‌ ఈ విషయాన్ని రివీల్ చేశారు. దసరాకు అప్‌డేట్‌ లేదన్న తమన్‌, ఈ వెయిటింగ్‌ వర్తే అనిపించే రేంజ్‌ కంటెంట్ రెడీ అవుతుందని హామీ ఇచ్చారు.

Game Changer Movie Updates

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్‌. గ్రాఫిక్స్ వర్క్‌ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్‌, గింప్ల్స్‌ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్‌ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. దసరా మిస్ అయితే దీపావళికి బ్లాస్ట్ ఉంటుందని ఆడియన్స్‌ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారు తమన్‌. అక్టోబర్ 30న థర్డ్ సింగిల్‌ పక్కాగా రిలీజ్ అవుతుందని హామీ ఇచ్చారు. తాజా అప్‌డేట్‌లో రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారటీ ఇచ్చారు. డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

జరగండి, రా మచ్చ సాంగ్స్‌ విషయంలో ముందు నెగెటివ్ కామెంట్స్ వినిపించినా… ఫైనల్‌గా సూపర్ హిట్ అయ్యాయి. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సత్తా చాటుతున్నాయి. దీంతో సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

Also Read : Rajinikanth : ‘అమరన్’ టీమ్ కి అభినందనలు తెలిపిన తలైవా

Cinemagame changerGlobal Star Ram CharanUpdatesViral
Comments (0)
Add Comment