Game Changer : డల్లాస్ ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

ప్రభుత్వఅధికారి, రాజకీయ నాయకుడి మధ ఘర్షణ చుట్టూ ఈ కథ తిరుగుతుంది...

Game Changer : కోలీవుడ్‌ అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’ రామ్‌ చరణ్‌, కియారా జంటగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయింది. తాజాగా డల్లాస్‌ (యూఎస్‌ఎ)లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా నిర్వహించారు. దర్శకులు సుకుమార్‌, బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఆ వేడుకలో శంకర్‌ ఆసక్తికర విశేషాలు షేర్‌ చేశారు.

‘‘ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నా. అందుకే ఇక్కడకు రావాలా? వద్దా? అని ఆలోచించా. మీ అందరి ఎనర్జీ చూసేందుకు వచ్చా. ‘పోకిరి’, ‘ఒక్కడు’ లాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని అనుకున్నా. అందులోనూ నా మార్క్‌ ఉండాలని కోరుకున్నా. అలా వచ్చిందే ‘గేమ్‌ ఛేంజర్‌’. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. తెలుగులో ఇదే తొలి సినిమా. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు. చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. అది వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత మహేశ్‌ బాబుతో చేయాలనుకున్నా. ప్రభాస్‌తో కరోనా సమయంలో చర్చలు జరిగాయి. అది కార్యరూపం దాల్చలేదు. ఫైనల్‌గా రామ్‌ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది.

Game Changer Director Comment

ప్రభుత్వఅధికారి, రాజకీయ నాయకుడి మధ ఘర్షణ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రామ్‌ చరణ్‌ సెటిల్డ్‌గా నటించారు. కాలేజ్‌ లుక్‌లో చాలా ఫైర్‌ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్న గా అద్భుతంగా నటించారు. సాంగ్స్‌లో అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్‌, డ్యాన్స్‌లతో కట్టిపడేస్టార్‌ చరణ్‌. ఎస్‌.జె. సూర్య చక్కగా నటించారు. అంజలి సహజ నటి. ఆమె పాత్ర షాకింగ్‌గా ఉంటుంది. శ్రీకాంత్‌, బ్రహ్మానందం, సునీల్‌, వెన్నెల కిషోర్‌ ఇలా ప్రతి ఒక్కరికీ మంచి పాత్రలు దక్కాయి. దిల్‌ రాజు అంతా తానై ఈ సినిమాని ముందుకు నడిపించారు. కెమెరామెన్‌ తిరుతో ముందుగానే ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీ గురించి చెప్పా. ‘డోప్‌’ సాంగ్‌కి లక్షకు పైగా చిన్న లైట్లను వాడాం. ‘జరగండి’ పాట కోసం విలేజ్‌ సెట్‌ను క్రియేట్‌ చేశాం. సాబూ సిరిల్‌ సెట్స్‌ బాగా డిజైన్‌ చేశారు. తెలుగు సినిమాలో తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉండాలనే ఉద్దేశంతో తమన్‌ను తీసుకున్నా. మంచి పాటలు ఇచ్చారు. మా కోసం ఇక్కడకు వచ్చిన సుకుమార్‌కు థాంక్స్‌. రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు మంచి విజయాన్ని అందుకోబోతున్నారు’’ అని పేర్కొన్నారు.

Also Read : Jagapathi Babu : రేవతి కుటుంబ పరామర్శ పై స్పందించిన నటుడు జగపతి బాబు

CommentsDirector Sankargame changerShankarTrendingViral
Comments (0)
Add Comment