Gabbar Singh: ట్రెండ్ సెట్ చేయడానికి మరోసారి వస్తున్న ‘గబ్బర్‌ సింగ్‌’ ! ట్రైలర్ ఇదిగో !

ట్రెండ్ సెట్ చేయడానికి మరోసారి వస్తున్న ‘గబ్బర్‌ సింగ్‌’ ! ట్రైలర్ ఇదిగో !

Gabbar Singh: పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌(Gabbar Singh)’. హిందీలో సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు రీమేక్ గా నిర్మించిన ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ నటించింది. హరీశ్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ సరికొత్త మేనరిజం, దేవీ శ్రీప్రసాద్ సన్సేషనల్ మ్యూజిక్ తో 2012లో విడుదలైన ఈ సినిమా… పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఖుషీ సినిమా తరువాత సూపర్ హిట్ కోసం సుమారు పది సంవత్సాలుగా ఎదురుచూసిన పవర్ స్టార్ అభిమానులకు… మరచిపోలేని హిట్ ను అందించింది.

Gabbar Singh..

అయితే జనసేన పార్టీను స్థాపించి ఒకవైపు రాజకీయాలు… మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా మారిన పవన్ కళ్యాణ్ నుండి ఏడాదికి ఒక సినిమా రావడం గగనంగా మారింది. దీనితో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజులకు పాత హిట్ సినిమాలనే రీ రిలీజ్ చేసుకుని ప్రేక్షకులను అలరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్(Gabbar Singh) ఇప్పటికే ఓ సారి విడుదలైయింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 2 న జరగబోయే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తాను స్థాపించిన జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచి రికార్డు సృష్టించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును మరింత ఘనంగా జరుపుకోవాలని అభిమానులు డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ ను హిట్ బాట పట్టించిన ‘గబ్బర్‌ సింగ్‌’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ‘గబ్బర్‌ సింగ్‌’ రీ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పవన్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, నాగినీడు, సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బండ్ల గణేష్ నిర్మాత.

Also Read : Darshan Thoogudeepa: బళ్లారి జైలుకు కన్నడ స్టార్ హీరో, అభిమాని హత్యకేసు నిందితుడు దర్శన్‌ !

Gabbar Singhpawan kalyan
Comments (0)
Add Comment