Ram Charan: భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు గతంలో ఈ సినిమాను ప్రశంసించగా.. తాజాగా ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో.. రామ్ చరణ్‌ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. దీంతో ఎక్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Ram Charan…
‘‘ఆర్‌ఆర్‌ఆర్’లో మెయిన్ హీరో రామ్ చరణ్(Ram Charan) నటన అద్భుతం. ఎంట్రీ సీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నారు’’ అని ప్రశంసించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘RRR’. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్ గా కనిపించనుండగా… అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Veeranjaneyulu Vihara Yatra: బంతి భోజనంలో ‘వీరాంజనేయులు విహారయాత్ర’ టీమ్ !