Imanvi : పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అందరి హీరోల కంటే ప్రత్యేకం..భిన్నం కూడా. ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఎక్కడ సినిమా షూటింగ్ జరిగినా తన ఇంటి నుంచి వడ్డించడమే కాదు స్వయంగా క్యార్వాన్ ను తెప్పిస్తాడు. తనే స్వయంగా వడ్డిస్తాడు. తెలుగు వారి రుచులను ఇతర నటీ నటులకు రుచి చూపిస్తాడు. గత కొంత కాలంగా విధిగా పెట్టుకున్నాడు.
Imanvi Surprised for Prabhas Home Food
తనకు భోజనం అంటే చచ్చేంత ఇష్టం. యూనిట్ మొత్తానికి తనే ఇంటి భోజనం అందించేలా చూసుకుంటాడు. అందుకే చాలా మంది హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలు సైతం ఎక్కువగా ప్రభాస్ ను అమితంగా ఇష్ట పడతారు. ప్రత్యేకించి హీరోయిన్లు తనంటే లంచ్ , డిన్నర్ విషయంలో ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.
తను ఇప్పుడు పలు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఇందులో ఇమాన్వి(Imanvi) హీరోయిన్ గా నటిస్తోంది. తనకు ఇంటి భోజనంతో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. లంచ్ బాక్సులతో తన కడుపు నిండి పోయిందంటూ ఆనందం వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Hero Salmaan-AR Movie : ఏఆర్ ‘సికందర్’ మ్యాజిక్ చేస్తాడా