KTR : న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ కావాలనే కేటీఆర్ పై కక్ష సాధింపుతో కేసు నమోదు చేసిందని లాయర్ సుదరం వాదించారు. ప్రభుత్వం మారగానే ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని పేర్కొన్నారు.
KTR Case Updates
ఇది ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు అని, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయని తెలిపారు. డబ్బులు తీసుకున్న వారిని, హైదరాబాద్ నగర పాలక సంస్థను నిందితులుగా చేర్చలేదంటూ వాపోయారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రొహత్గి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారని కోర్టుకు విన్నవించారు. రూ. 40 కోట్లకు పైగా ఎలా కేబినెట్ అప్రూవ్ లేకుండా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. ఈ మొత్తం కేసు వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దమైంది.
Also Read : Ex CM Kiran Kumar Reddy : వైఎస్సార్ బతికున్నా విభజన ఆగేది కాదు