Ex MLA Gummadi Narsaiah Shocking : సీఎం నిర్వాకం గుమ్మ‌డి న‌ర్స‌య్య‌కు అవ‌మానం

అపాయింట్మెంట్ ఇచ్చేంత దాకా వెళుతూ ఉంటా

Gummadi Narsaiah : హైద‌రాబాద్ – ఆయ‌న ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు పొందారు. ప్ర‌జా నాయ‌కుడిగా పేరు పొందారు. అత్యంత సాధార‌ణ‌మైన జీవితం గ‌డిపే ఆయ‌న ఎవ‌రో కాదు ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మ‌డి న‌ర్స‌య్య‌(Gummadi Narsaiah). నీతి, నిజాయితీ, నిబ‌ద్ద‌ద‌త క‌లిగిన నేత‌గా ప్ర‌జాద‌ర‌ణ పొందారు.

Gummadi Narsaiah Shocking Comments on CM

ఐదుసార్లు శాస‌న స‌భ్యుడిగా ఎన్నికైన ఆయ‌న‌కు ఘోర‌మైన అవ‌మానం జ‌రిగింది. ఇదే విష‌యాన్ని తానే స్వ‌యంగా చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప‌లుమార్లు సీఎంఓ ఆఫీస్ కు, స‌చివాల‌యానికి, రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లాన‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇల్లెందు నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని కోరేందుకు విన‌తిప‌త్రం ఇవ్వాల‌ని వెళ్లాన‌ని కానీ అక్క‌డి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌న్నారు. సీఎం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి జైపాల్ రెడ్డి పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు గుమ్మ‌డి న‌ర్స‌య్య‌. రేవంత్ రెడ్డి కార్యాలయం ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్‌మెంట్ నిరాకరించడం ద్వారా అవమానించిందని ఆరోపించారు.

జూబ్లీహిల్స్‌లోని సీఎంఓ వెలుపల మాజీ ఎమ్మెల్యే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అధికారులు, సిబ్బంది అతన్ని లోపలికి అనుమతించ కపోవడంతో అవమానంతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తరువాత మీడియాతో మాట్లాడారు గుమ్మ‌డి న‌ర్స‌య్య‌.

Also Read : Ministry of Broadcasting Warning :ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ లు గీత దాటితే వేటు

CM Revanth ReddyCommentsGummadi NarsaiahViral
Comments (0)
Add Comment