YS Jagan Sensational :కూట‌మి స‌ర్కార్ బేకార్ – వైఎస్ జ‌గ‌న్

రైతుల‌ను ఆదుకోవ‌డంలో విఫ‌లం

YS Jagan : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. ఆరుగాలం శ్ర‌మించి మిర్చి పండించిన రైతుల‌కు ఎందుకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అమ‌లు చేయ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. బుధ‌వారం గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించారు.

YS Jagan Sensational Comments

ఈ సంద‌ర్భంగా మిర్చి యార్డును సంద‌ర్శించారు. పంట‌ను అమ్ముకునేందుకు వ‌చ్చిన అన్న‌దాత‌ల‌తో మాట్లాడారు. ఒక ఎక‌రా మిర్చి పండించేందుకు క‌నీసం పెట్టుబ‌డి ల‌క్ష‌న్న‌ర‌కు పైగా అవుతోంద‌ని చెప్పారు. గ‌తంలో క్వింటాలు మిర్చికి రూ. 20 వేలు ద‌క్కేద‌న్నారు.

కానీ టీడీపీ ప్రభుత్వం రూ. 8 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్ర‌మే ల‌భిస్తోంద‌ని వాపోయారు. దీనిపై స‌ర్కార్ ను నిల‌దీయాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ మోహన్ రెడ్డి(YS Jagan) మీడియాతో మాట్లాడారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు ప్ర‌భుత్వం ప‌ని చేస్తోందంటూ నిల‌దీశారు. అన్నం పెట్టే రైతుల ప‌ట్ల ఇంత వివ‌క్ష ప‌నికి రాద‌న్నారు. ఏదో ఒక రోజు తిర‌గ‌బ‌డే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. రైతుల‌ను బాధ పెట్టిన ఏ స‌ర్కార్ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితీ దారుణంగా ఉంద‌న్నారు. సీఎం , వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నార‌ని, నిద్ర పోతున్నారా అంటూ మండిప‌డ్డారు. రాష్ట్ర స‌చివాల‌యం మార్కెట్ యార్డుకు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నా పాల‌కుల‌కు వినిపించ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

రైతుల‌ను ఆదుకోవ‌ల‌ని, పండించిన అన్ని పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

Also Read : Salman-Sikandar Sensational :షేక్ చేస్తున్న స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ పోస్ట‌ర్

BreakingCommentsnewsViralYS jagan
Comments (0)
Add Comment