Double Ismart : దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంతకు ముందు విజయం సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ తో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఛార్మి కౌర్ ఈ సినిమాకి నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈరోజు ఈ సినిమా నుండి ‘మార్ ముంత, చోడ్ చింత..’ అనే పాట లిరిక్స్ ని విడుదల చేశారు చిత్ర నిర్వాహకులు.
Double Ismart Song
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ పాడారు. ఇది ఒక మాస్ నంబర్ అని చెప్పొచ్చు. రామ్ పోతినేని(Ram Pothineni) పక్కన కావ్య థాపర్ ఇందులో నటిస్తోంది, ఆమె సినిమాలో ఎంత గ్లామరస్ గా వుండబోతోంది ఈ పాట చూస్తేనే అర్థం అయిపోతుంది. ఈ పాటలో ఇంకో విశేషం ఏంటంటే ఇందులో ప్రేక్షకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) గొంతును కూడా వినవచ్చు. కెసిఆర్ మామూలుగా అతని ప్రెస్ మీట్ లో చెప్పే పదం ‘ఏం జెద్దామంటావ్ మరి’ అనేవి ఈ పాటలో వినపడతాయి.
ఈమధ్య సామాజిక మాధ్యమం బాగా పెరిగిపోవటంతో చాలామంది వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ‘ఐపోయ్’ అని ఒక స్వామిజీ చెప్పిన పదం చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే, ఆ పదాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడు అలాగే కెసిఆర్ మామూలుగా అంటూ వుండే ‘ఏం జెద్దామంటావ్ మరి’ అనే ఊతపదం కూడా ఈపాటలో ప్రేక్షకులు వినొచ్చు. ఈ సినిమాలో ఇంకా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు.
Also Read : Bloody Ishq OTT : ఓటీటీలో రానున్న అవికా గోర్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘బ్లడీ ఇష్క్’