Srikakulam Sherlock Holmes: టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది 20కి పైగా సినిమాల్లో కనిపించిన ఈ స్టార్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్…. 2024 సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ సినిమాల్లో నటించి అభిమానులను అలరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, కమల్ హాసన్ ఇండియన్-2 చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఓ వైపు కమెడియన్ గా నటిస్తూనే.. మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ‘చారి 111’ మూవీతో హీరోగా మారిన వెన్నెల కిషోర్… ఇప్పుడు లీడ్ రోల్ లో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వెన్నెల కిషోర్ సరసన అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Srikakulam Sherlock Holmes…
కొన్ని రోజుల క్రితం… శ్రీకాకుళం(Srikakulam) షెర్లాక్ హోమ్స్ ఫస్ట్ లుక్ ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్ చేయగా… ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ జోష్ తో నేడు మేకర్స్… ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. మా ఊరు శ్రీకాకుళం.. మేమంతా శ్రామికులం అంటూ సాగుతున్న సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా నుండి వలస వెళ్లిన వారు అక్కడ ఎలా ఉంటారు? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? అనే అంశాలతో సాగుతున్న ఆ పాట మనసులను హత్తుకుంటోంది. సూట్ కేస్ పట్టుకున్న వెన్నెల కిషోర్ ఊరికి వస్తున్నట్లు చూపించారు. పాట అంతా గ్రామీణ విజువల్స్ తో నిండిపోయింది. సాంగ్ షూటింగ్ బిట్స్ ను కూడా యాడ్ చేశారు మేకర్స్. సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి అందించిన అద్భుతమైన లిరిక్స్ కు స్టార్ సింగర్ మంగ్లీ తన గాత్రంతో ప్రాణం పోశారు.
సునీల్ కశ్యప్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మూవీపై ఫస్ట్ సింగిల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు. వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, షియా గౌతమ్, అనీష్ కురువిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
Also Read : Sai Dharam Tej: పాన్ ఇండియా ప్రాజెక్టుగా సాయి ధరమ్ తేజ్ ‘SDT18’ !