Uruku Patela : ఓ కొత్త సినిమా ‘ఉరుకు పటేల’ సినిమా నుంచి ఫస్ట్ లుక్

ముందుగా ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తేజ‌స్ కంచ‌ర్ల ప‌రిగెడుతుంటే అత‌ని వెనుక క‌త్తిని ఎవ‌రో విసిరేసిన‌ట్లు క‌నిపిస్తుంది...

Uruku Patela : ‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నటుడు తేజ‌స్ కంచ‌ర్ల‌. ఇప్పుడు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తేజస్ చేస్తున్న ‘ఉరుకు పటేల’ చిత్రం.. ప్రేక్షకులకు ఆయనని మరింత దగ్గర చేస్తుందని ఎంతో నమ్ముతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ గెట్ ఉరికిఫైడ్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర వివరాలను తాజాగా మేకర్స్ తెలియజేశారు.

Uruku Patela Movie Updates

ముందుగా ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తేజ‌స్ కంచ‌ర్ల(Tejas Kancherla) ప‌రిగెడుతుంటే అత‌ని వెనుక క‌త్తిని ఎవ‌రో విసిరేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రో వైపు మంగ‌ళ‌సూత్రం, పోస్ట‌ల్ బ్యాలెట్ పేప‌ర్‌, పాల క్యాన్ అన్నీ క‌నిపిస్తున్నాయి. ఇది గ్రామీణ నేప‌థ్యంలో భావోద్వేగాల ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మ‌ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని కలిగించేలా ఉంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయనే దానికి సింబాలిక్‌‌గా పోస్టర్‌ని డిజైన్ చేశారు. అలాగే ఈ టైటిల్‌కు మాదిరిగానే.. సినిమా కూడా ఉరుకే ఉరుకు అన్నట్లుగా ఉంటుందనేలా ఈ ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చేస్తోంది.

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ ‘ఉరుకు పటేల’ సినిమాను నిర్మిస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యిందని.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని, త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని ఈ సందర్భంగా చిత్రయూనిట్ తెలియ‌జేసింది.

Also Read : Jr NTR : ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న ఆ క్రేజీ దర్శకులు

New MoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment