Independence Day: ఇండిపెండెన్స్ డేపై స్టార్స్ ట్వీట్స్ !

ఇండిపెండెన్స్ డేపై స్టార్స్ ట్వీట్స్ !

Independence Day: 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. వంటి వారంతా ట్విట్టర్ ఎక్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ(Independence Day) శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌తో టాలీవుడ్ నిర్మాతలు సందడి చేశారు. ప్రస్తుతం స్టార్స్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Independence Day…

ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు ఎందరో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్లందరినీ మరొక్కసారి స్మరించుకుని.. ఆదర్శంగా తీసుకుందాం. జైహింద్‌.. అని చిరంజీవి తన పోస్ట్‌ లో పేర్కొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ పాల్గొని జెండా ఆవిష్కరణ గావించారు. ఇంకా పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జైహింద్ అని పోస్ట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జైహింద్ అని పోస్ట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Also Read : Aay Movie Review : ఎన్టీఆర్ బావమరిది హీరోగా తీసిన ‘ఆయ్’ సినిమా రివ్యూ

Icon Star Allu ArjunIndependence DayMegastar ChiranjeeviYoung Tiger NTR
Comments (0)
Add Comment