Poonam Kaur : పూనమ్ ట్వీట్ పై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్

తాజాగా.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఎబిఎన్‌తో మాట్లాడుతూ....

Poonam Kaur : గ‌త రెండు రోజులుగా జానీ మాస్ట‌ర్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే జానీని జ‌న‌సేన పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌గా నిన్న టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జానీ మాస్టర్‌ మీద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఆదేశించామని అన్నారు. తాజాగా.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఎబిఎన్‌తో మాట్లాడుతూ.. మ‌హిళల భద్రత విషయంలో టాలీవుడ్ మిగతా చిత్ర పరిశ్రమల కంటే ఎంతో ముందుందని, వర్క్ ప్లేస్ లో అమ్మాయిలకు వేధింపులు ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దవారినైనా మేము విచారిస్తాం అన్నారు. పూనమ్ కౌర్(Poonam Kaur) కమిటీలో రిపోర్ట్ చేయకుండా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపయోగం లేదని వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌న్నారు. ఎవరికి ఎంత ఇన్ ఫ్లూయెన్స్ ఉన్నా.. కమిటీ విచారణ మాత్రం న్యాయబద్దంగా జరుగుతుందన్నారు.

Poonam Kaur…

ఇక‌.. జానీ మాస్టర్‌ వేధింపుల కేసు విషయంలో ఎలాంటి ప్రెజర్స్ కు కమిటీ లొంగదని, జానీ కేసులో కమిటీ రిపోర్ట్ అనేది బహిర్గతం చేయమని.. ఇది ఇండస్ట్రీలో అంతర్గతంగానే ఉంటుందన్నారు. ప్రభుత్వ తరపునుంచి గైడ్ లైన్స్ వస్తే కమిటీకి మరింత బలం చేకూరుతుందన్నారు. ఇదిలాఉండ‌గా.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు,ఎదుర్కొంటున్న వారు టీఎఫ్‌సీసీకి ఎనీ టైం ఫిర్యాదు చేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆఫీసు వద్ద ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంప్లైంట్‌ బాక్స్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డి.రామానాయుడు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ – 500096 చిరునామాకు పోస్టుద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫోన్‌ నంబరు : 98499 72280, మెయిల్‌ ఐడీ : complaints@telugufilmchamber.in కు కంప్లైంట్స్‌ ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేసింది.

Also Read : Ananya Nagalla : ఏపీ సీఎం కు వరద సాయం చెక్కు అందజేసిన నటి అనన్య

BreakingCommentsPoonam KaurTweetViral
Comments (0)
Add Comment