Bangalore Rave Party: బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోదాలు నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వార్, బెంజ్ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Bangalore Rave Party Viral
అయితే ఈ రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ(Hema), యాంకర్ శ్యామలతో పాటు పలువురు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తరువాత జరుగున్న పార్టీ కావడంతో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ, టెలివిజన్ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో నిషేదిత డ్రగ్స్ పెద్ద ఎత్తున ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కొంత డ్రగ్స్ ను సీజ్ చేసి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
Also Read : Yami Gautam: అక్షయ తృతీయ రోజున తల్లయిన బాలీవుడ్ బ్యూటీ !