Fighter Movie : శ‌ర‌వేగంగా ఫైట‌ర్ మూవీ షూటింగ్

హృతిక్ రోష‌న్..దీపికా ప‌దుకొనే న‌ట‌న‌

Fighter Movie : అంద‌రి చూపుల‌న్నీ ఇప్పుడు స్టార్ హీరో హృతిక్ రోష‌న్ , అందాల తార దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టిస్తున్న ఫైట‌ర్(Fighter Movie) పై ఉన్నాయి. దీపికా ప‌దుకొనే సూప‌ర్ స్పీడ్ లో ఉన్నారు. ఆమె షారుక్ ఖాన్ తో వ‌రుస‌గా రెండు సినిమాల‌లో న‌టించింది.

ఈ ఏడాది విడుద‌లైన ప‌ఠాన్ లో పూర్తి స్థాయిలో న‌టించింది దీపికా. ఈ చిత్రం రూ. 1,000 కోట్లు వ‌సూలు చేసింది. రికార్డు బ్రేక్ చేసింది. తాజాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైల‌ర్ చిత్రంలో గెస్ట్ పాత్ర‌లో న‌టించి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది దీపికా.

Fighter Movie Updates

ఇక సిద్దార్థ్ ఆనంద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా హృతిక్, దీపికాతో క‌లిసి ఫైట‌ర్ తీస్తున్నాడు. దీని బ‌డ్జెట్ క‌నీసం రూ. 250 కోట్లకు పైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు టాక్. ఫైట‌ర్ కు సంబంధించిన పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ న‌టుడు అనిల్ కపూర్ కూడా న‌టిస్తున్నారు.

ఫైట‌ర్ సినిమా గురించి జ‌న‌వ‌రి 10, 2021న ప్ర‌క‌టించారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యమైంది. అస్సాం, హైద‌రాబాద్ , జ‌మ్మూ కాశ్మీర్ , ముంబై ల‌లో షూటింగ్ కొన‌సాగింది. విశాల్ – శేఖ‌ర్ ద్వ‌యం ఫైట‌ర్ కు సంగీతం అందించారు.

ఇందులో ఐదు పాట‌లు ఉన్నాయి. స‌చ్చిత్ పౌలోస్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. వ‌చ్చే ఏడాది 2024లో జ‌న‌వ‌రి నెల‌లో విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ ట్రై చేస్తున్నారు.

Also Read : Megastar New Movie : మెగాస్టార్ తో వ‌శిష్ట కొత్త సినిమా

Comments (0)
Add Comment